కొహ్లీకి పాక్ అభిమాని విన్నపం..

  • In Sports
  • October 10, 2019
  • 220 Views
కొహ్లీకి పాక్ అభిమాని విన్నపం..

దాదాపు దశాబ్ద కాలం అనంతరం పాకిస్థాన్ వేదికగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ టోర్నీలో భాగంగా టీ20 సిరీస్‌ను శ్రీలంక కైవశం చేసుకుంది. అయితే మూడో టీ20 మ్యాచ్ జరిగిన లాహోర్‌లో ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు అందరి దృష్టిని ఆకర్షించింది.మ్యాచ్ చూడడానికి వచ్చిన షాబాజ్ షరీఫ్ అనే ఓ అభిమాని విరాట్ కొహ్లీ పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడితే చూడాలని ఉందని ఎప్పుడు ఆడతావంటూ ప్రశ్నిస్తూ ప్రదర్శించిన ప్లకార్డు అందరి దృష్టిని ఆకర్షించింది.విరాట్ కొహ్లీకి తాను వీరాభిమానినని అందుకే పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడాలంటూ ప్లకార్డు ప్రదర్శించినట్లు షాబాజ్ ట్విట్టర్‌లో వెల్లడించాడు.ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో కోహ్లీ కన్నా ముందే..అతని అభిమానులు ఆ ట్వీట్ కి స్పందించారు. మీ కోరిక ఏదో ఒక రోజు నిజమౌతుంది అంటూ కొందరు ట్వీట్లు చేస్తుండటం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos