తెలంగాణ పరిధిలోని ఏ ఉద్యోగ సంఘం ధైర్యం చేసే వీలు లేకుండా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులపై చర్యలు తీసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.తన హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా సమ్మె కొనసాగిస్తున్న కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.ఎటువంటి అధికారిక చర్యలు లేకుండానే ఆర్టీసీలో 48వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేయడానికి సైతం కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సమ్మె కారణంగా తమ ఉద్యోగాల్ని తామే సెల్ప్ డిస్మిస్ చేసుకున్న 48వేల మందికి ప్రత్యామ్నాయంగా ఖాళీల్ని భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న సంకేతాల్ని పంపుతున్నారు.దీంతో ఒత్తిడి పెరిగి కార్మికుల మధ్య చీలిక తీసుకువచ్చి కార్మికులే స్వయంగా దిగివచ్చి విధుల్లో చేరేలా చేయడానికి కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది..