హైదరాబాద్: తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 114 మంది సభ్యులు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ వీరందరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, తెరాస సభ్యుడు మాధవరం కృష్ణారావు, తెదేపా సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, భాజపా సభ్యుడు రాజాసింగ్ ఇంకా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది.
మరోవైపు శాసనసభాపతి ఎవరనే ఉత్కంఠకు ఈరోజు తెరపడింది. శాసనసభాపతి అభ్యర్థిగా బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి(69)ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.