హైదరా బాదు: తెలంగాణలో రహదారి రవాణా సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హత్యం చేస్తున్నారని ఆగ్రహించారు. న్యాయంగా సమ్మె చేస్తున్న రవాణా సంస్థ కార్మికులకు ప్రజలు అండగా నిలవాలని భట్టి ప్రజలు పిలుపు నిచ్చారు.