శ్రీనగర్: అవంతిపొరాలో మంగళవారం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది ఒకరు హతమైనట్లు భద్రతా బలగాలు తెలిపాయి. గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్ర వాదులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణకు భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. ఘటనా స్థలంలో పేలుడు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం బలగాలు గాలిస్తున్నాయి.