సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం

సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం

న్యూ ఢిల్లీ: సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటామని వాయుసేన అధిపతి ఆర్కేఎస్ భదౌరియా పేర్కొన్నారు. ఘజియాబాద్లోని హిందన్ వైమానిక స్థావరం వద్ద మంగళ వారం భారత వైమానిక దళం 87వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పరేడ్లో ప్రసంగించారు. గత కొన్నేళ్లుగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కొన్ని కారణాల వల్ల దేశ భద్రతకు సవాళ్లు ఏర్పడ్డాయి. అయినా మేం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉన్నాం. భారత వైమానిక దళం ఉగ్రమూకలపై దాడులు చేయడంలో సత్తా చాటింది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం. పుల్వామా దాడి ఎప్పటికే మరువలేనిది. పూర్తి నైపుణ్యంతో బాలాకోట్లోని తీవ్రవాద శిబిరాలపై దాడులు విజయవంతం చేశాం. ఈ దాడుల్లో పాల్గొన్న వ్యక్తులు, కమాండ్లు, యూనిట్ల సేవలను మర్చిపోలేం. ఉగ్రదాడులను నియంత్రించడంలో ఇది కీలక అడుగనే చెప్పాలి.భారత వైమానిక దళంలోని అన్ని విభాగాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ, డీఆర్డీవో ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థుల సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటామని వాయుసేన అధిపతి ఆర్కేఎస్ భదౌరియా పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos