ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టడం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.వైసీపీ నేత,సినీ నిర్మాత పీవీపీని బెదిరించినందుకు బండ్ల గణేశ్‌పై కేసు నమోదు చేసుకున్న జూబ్లిహిల్స్ పోలీసులు గణేశ్ కోసం గాలిస్తున్నారు.నాలుగేళ్ల క్రితం విడుదలైన టెంపర్ చిత్రం కోసం పీవీపీ రూ.30 కోట్ల ఫైనాన్స్ చేశారు.చిత్రం విడుదలకు ముందు అసలు చెల్లించేసిన బండ్ల మిగిలిన బాకీకి సంబంధించి చెక్కులు ఇచ్చారు.ఏళ్లు గడుస్తున్నా మిగిలిన డబ్బులు ఇవ్వకపోవడంతో మిగిలిన డబ్బులు చెల్లించాలంటూ బండ్లపై ఒత్తిడి చేయడంతో గణేశ్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో శుక్రవారం రాత్రి పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గణేష్ తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు.గతంలో కూడా బండ్ల గణేష్ పై ఇలాంటి కేసులు పెట్టారు. .