ముంబై: ఇక్కడి ఆరే ప్రాంతంలో చెట్లను నరక కుండా ఆపాలని పర్యావరణ అభిమానులు దాఖలు చేసిన వినతిని ముంబై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. ఆరే కాలనీ చెట్లను నరికి మెట్రో రైలు కారు షెడ్ భవనాలనిర్మాణం చేపట్టనున్నట్టు ముంబయి మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. దీన్నివ్యతిరేకించి గత రెండేళ్లుగా పర్యావరణ అభిమానులు పెద్ద ఎత్తున నిరసించారు. ఈ ఉద్యమానికి పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించారు. మెట్రో రైలు నిర్ణయాన్ని సవాల్ చేయడంతో పాటు ఆరే కాలనీని అటవీ ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వేతర సంస్థ-వనశక్తి, మరికొన్ని సంస్థలు దాకలు పిటిషన్ల పై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆరే కాలనీని అటవీ ప్రాంతంగా ప్రకటించేందుకు నిరాకరించింది. అది అడవి కానందున అక్కడి చెట్ల నరికివేతను నిలిపివేయజాలమని తేల్చి చెప్పింది. ఈ వివాదం అత్యున్నత న్యాయస్థానం, జాతీయ హరిత న్యాయ పంచాయతి విచారణలో ఉన్నందున వ్యాజ్యాల్ని తిరస్కరించినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, జస్టిస్ భారతి డాంగ్రే ధర్మాసనం ప్రకటించింది. ఇది ఆందోళనకారులకు ఎదురు దెబ్బ.