నియంతృత్వ దిశలో భారత్‌

నియంతృత్వ దిశలో భారత్‌

వయనాడ్: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ నియంతృత్వం దిశగా భారత్ పయనిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ‘దేశంలో ఏమి జరుగుతోందో యావత్ ప్రపంచానికీ తెలుసు. మనం నియంతృత్వ దిశగా వెళ్తు న్నాం. ఇది చాలా స్పష్టం. ప్రధాని మోదీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏమి మాట్లాడినా వాళ్లని జైళ్లకు పంపుతున్నార’ని మండిపడ్డారు. పెరుగుతున్న మూక హత్యలపై ఆందోళన వ్యక్తం చేసి, మోదీకి బహిరంగ లేఖ రాసిన వారి పై దేశ ద్రోహ నేరారోపణ చేయటాన్ని ప్రస్తావించినపుడు ఈ మేరకు స్పందించారు. ‘ప్రస్తుతం దేశంలో సైద్ధాంతిక పోరాటం జరుగుతోంది. ఈ దేశాన్ని ఒకే వ్యక్తి , ఒకే సిద్ధాంతం పాలించాలి. ఆక్షేపించిన వారి నోరు నొక్కేయటమే మూయించాలన్నదే ఆ సిద్ధాంతమ’ని వ్యాఖ్యానించారు. ‘భిన్నభిప్రాయాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలను గౌరవించాలని కాంగ్రెస్, విపక్షాల విధానం.విపక్షాల గొంతు నొక్కేయడం మంచిది కాద’న్నారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్లే నిరుద్యోగం పెరిగిపోతోందని బలమైన దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ, భాజపా ధ్వంసం చేయటంతో జీడీపీ వృద్ధి ఎక్కడా కానరావటం లేదని విరుచుకుపడ్డారు. ‘దేశంలోని 15 మంది వ్యక్తులకు ప్రభుత్వం రూ.1,25,000 కోట్ల పన్ను ప్రయోజనాలు కల్పించింది. కేరళ ప్రజలు మాత్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బుల కోసం గగ్గోలుపెడుతున్నారు. దేశం కేవలం ఆ 15 మంది వ్యక్తుల కోసమేనా? దేశంలోని పేదల మాటేమిటి? ఆర్థిక వ్యవస్థను ఎందుకు ధ్వంసం  చేశారు? మోదీ సమాధానం చెప్పి తీరాల’ని డిమాండు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos