ఐదో రోజూ నష్టాలే

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్ర వారం భారీ నష్టాల్ని చవి చూసాయి. వడ్డీ రేట్లను భారతీయ రిజర్వ్ బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించినా మదుపర్లలలో విపణి పట్ల విశ్వాసం పెరగలేదు. బ్యాంకుల షేర్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సెన్సెక్స్ 433 పాయింట్లు పతనమై 37,673కు పడి పోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 11,174కి పతనమైంది. బిఎస్ఈలో టీసీఎస్ (1.03%), ఇన్ఫోసిస్ (0.90%), ఓఎన్జీసీ (0.82%), టెక్ మహీంద్రా (0.74%), ఎన్టీపీసీ (0.39%) బాగా లబ్ధి పొందగా కొటక్ మహీంద్రా బ్యాంక్ (-3.46%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.44%), టాటా మోటార్స్ (-2.86%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.75%), టాటా స్టీల్ (-2.39%) బాగా నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos