ముంబై : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యేలా భారీ కుట్ర జరిగిందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించినపుడు కొందరు అఖిల భారత కాంగ్రెస్ సమితి కార్యాలయాల్లో కూర్చుని ఆయన లక్ష్యాన్ని సాధించకుండా విఫలమయ్యేలా కుట్ర పన్నినట్లు ఆరోపించారు. ఇప్పుడు అలాంటి వారే పార్టీని నడిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ నానాటికీ రాజకీ యంగా కుంగి పోతోందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం కావటంతో ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నా రు. తర్వాత సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.