ముంబై : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మాఫియా నేత ఛోటా రాజన్ సోదరుడు దీపక్ నికాల్జే కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) అభ్యర్థిగా ఫల్తాన్ నియోజక వర్గంనుంచి పోటీ చేయనున్నారు. అది ఛోటా రాజన్ స్వస్థలం. ఆర్పిఐ ప్రస్తుతం బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఆర్పిఐతో కుదిరిన ఒప్పందం మేరకు భాజపా ఆ పార్టీకి ఆరు స్థానాల్ని కేటాయించింది.