ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో వ్యాపారాన్ని మొదలు పెట్టాయి. ఉదయం 9.41 గంటల వేళలోసెన్సెక్స్ 168 పాయింట్లు నష్టపోయి 38,143 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 11,307 వద్ద ట్రేడ్ అయ్యాయి. యస్ బ్యాంక్ మాత్రం భారీ లాభాలతో వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ షేరు ఒక దశలో దాదాపు 24 శాతం లాభ పడింది. టాటామోటార్స్ 1.6శాతం, హీరోమోటోకార్ప్ 1శాతం లాభపడగా. యాక్సిస్ బ్యాంక్ 4శాతం, భారతీ ఎయిర్టెల్ 2.5శాతం, సన్ఫార్మా 2 శాతం వంతున నష్ట పోయాయి.