హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యే అవకాశం ఉంది. పోచారం పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఖరారు చేశారని తెలుస్తుండగా మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇలా ఉండగా స్పీకర్ గా మాజీ వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.