హైదరాబాద్: ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పలువురు టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అహ్మద్‌ఖాన్ యాకుత్‌పురా నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. 1994 నుంచి 2018 వరకు యాకత్పురా నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం చేయిస్తారు. అదేరోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.