కమలంతో కలహాల్లేవు

పాట్నా: జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ మధ్య విభేదాల్లేవని శుక్ర వారం ఇక్కడ జరిగిన పార్టీ జాతీయ మండలి సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. రెండు పక్షాల మధ్య పొత్తు యథా ప్రకారం కొనసాగుతుందని చెప్పారు. తమ మధ్య విబేధాల సృష్టికి ప్రయత్నిస్తున్న వారికి ఎన్నికల ఫలితాలే బదులిస్తాయన్నారు. తమ కూటమి 2020 శాసనసభ ఎన్నికల్లో 200 కంటే ఎక్కువ స్థానాల్లో విజయాన్ని సాధిస్తాయనే దీమా వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి లోపించిన ప్రత్యర్థులు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగి ప్రచార లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థుల  విమ  ర్శల్ని పట్టించుకోరాదని కోరారు. ప్రతీ విమర్శకూ స్పందించాల్సిన పని లేదని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos