మునిగిన విపణి

మునిగిన విపణి

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నిండా మునిగి పోయాయి. భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్470.41 పాయింట్లు నష్ట పోయి  36,093.47 వద్ద, నిఫ్టీ 135పాయింట్ల నష్టంతో10704 వద్ద ట్రేడింగ్ ఆపాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు బలహీనం కావటం, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల గడువు తీరిపోనుండటంతో భారీగా విక్రయాలు సాగాయి. మధ్యహ్నం రెండు గంటల వేళకు నిఫ్టీ దాదాపు ఒక శాతం నష్టపోయింది. యస్ బ్యాంక్ షేర్లు భారీగా ఒడిదొడుకులకు లోనయ్యాయి. టాటా మోటార్స్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా తదితర షేర్లు లాభపడ్డాయి. యస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు మొదలైనవి భాగా నష్ట పోయాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.33గా దాఖలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos