కోహ్లీకి అఫ్రిది కితాబు

  • In Sports
  • September 19, 2019
  • 212 Views
కోహ్లీకి అఫ్రిది కితాబు

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. అతనో అసాధారణ ఆటగాడని ఆకాశానికి ఎత్తేశాడు. దక్షిణాఫ్రికాతో మొహాలీలో బుధవారం జరిగిన రెండో టీ20లో కోహ్లీ అర్ధ సెంచరీ చేయడం ద్వారా భారత జట్టును గెలుపు బాట పట్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలను సాధించిన రోహిత్‌ శర్మను కోహ్లీ ఈ మ్యాచ్‌లో అధిగమించాడు. ప్రస్తుతం కోహ్లీ 22 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. దీనిని ఐసీసీ ట్వీట్‌ చేయగా, అప్రిది రీట్వీట్‌ చేశాడు. ‘అభినందనలు కోహ్లీ. నువ్వో అసాధారణ ఆటగాడివి. నీ సక్సెస్‌ను ఇలాగే కొనసాగించు. క్రికెట్‌ ప్రేమికులందరినీ అలరించు` అని కామెంట్‌ కూడా చేశాడు. మొహాలీ టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos