విడుదలకు ముందే సైరా సంచలనం

  • In Film
  • September 19, 2019
  • 186 Views
విడుదలకు ముందే సైరా సంచలనం

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి తెలుగు ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభించింది. మూడు నిముషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. యూట్యూబ్‌లో తెలుగు ట్రైలర్‌ను 24 గంటల్లో అయిదు కోట్ల మంది వీక్షించారు. మూడు లక్షలు దాటి లైకులు వచ్చాయి. హిందీలో 50 లక్షలు, తమిళంలో తొమ్మిది లక్షలు, కన్నడంలో 6.7 లక్షలు, మలయాళంలో లక్షకు పైగా వీక్షణలు నమోదయ్యాయి. ట్రైలర్‌ తమ అంచనాలకు తగినట్లు ఉండడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. చిరంజవి గంభీర స్వరంతో చెప్పిన డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. హిందీతో పాటు నాలుగు దక్షిణ రాష్ట్రాల భాషల్లో విడుదలైన ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. అక్టోబరు 2న ఈ అయిదు భాషల్లో చిత్రం విడుదల కానుంది. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos