కర్నూలు : శ్రీశైలం జలాశయం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో బుధ వారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగి పోయింది. ఒకటో జనరేటర్ బ్రేక్ ప్యాడ్స్ మధ్య మంటలు చెలరేగి భారీగా పొగ కమ్ముకుంది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పే సారు. ప్రస్తుతం జనరేటర్ను మరమ్మతు చేస్తున్నారు. త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని తిరిగి మొదలవుతుందని అధికార్లు తెలిపారు.