ముంబై: స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ గురు వారం స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల వేళకు సెన్సెక్స్ 91 పాయింట్లు కోల్పోయి 36,472 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 10,807 వద్ద ట్రేడ్ అయ్యాయి. డాలర్‌తో రూపాయి విలువ 71.35 గా దాఖలైంది. నాల్కో, వొడా ఫోన్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాల్ని గడించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్ఎండీసీ, యస్‌బ్యాంక్ ,జీ ఎంటర్టై న్మెంట్, కోల్ ఇండియా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ నష్ట పోయాయి.