మోదీ సతీమణితో మమతా భేటీ

మోదీ సతీమణితో మమతా భేటీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి యశోదా బెన్‌ను కలసి మాట్లాడారు. మోదీతో సమావేశమయ్యేందుకు ఆమె కోల్‌కతా విమానాశ్రయానికి మంగళవారం రాత్రి వచ్చారు. అదే సమయంలో యశోదాబెన్‌ కోల్‌కతా నుంచి ధన్‌బాద్‌ వెళ్లడానికి అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు ఎదురుపడినప్పుడు ఒకరినొకరు పలకరించుకున్నారు. పరస్పరం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో యశోదా బెన్‌కు ఆమె చీరను బహూకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos