ముంబై: భారత రైతు జీవితగాథతో తెరకెక్కిన మోతీభాగ్ అనే డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఓ కుగ్రామానికి చెందిన విద్యాదత్ శర్మ అనే రైతు సాగించిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. ఉత్తరా ఖండ్ లోని పౌరీ గఢ్వాల్ ప్రాంతంలో అందరూ వ్యవసాయం వదిలి ఉద్యోగాల వైపు పరుగులు పెట్టినా తాను మాత్రం స్వగ్రామంలోనే ఉండి సేద్యం చేస్తాడు. పంట పొలాలకే అంకిత మ య్యా డు. భారత్ లో అత్యంత నాణ్యమైన ముల్లంగి పండించాడు. దేశంలో కెల్లా అత్యంత పెద్దదైన ముల్లంగి ఆయన పొలంలోనే పండింది. శర్మ రైతు మాత్రమే కాదు, మంచి సాహితీ వేత్త కూడా. పద్యాలు రాయడం, పాటలు పాడడం శర్మ ప్రవృత్తి. ఆయన జీవితం ఆధారంగా నిర్మల్ చందర్ దండ్రి యాల్ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఫిల్మ్ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిందని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలి పారు. దర్శకుడు నిర్మల్ చందర్ కు అభినందనలు తెలిపారు.