అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

  • In Crime
  • September 18, 2019
  • 380 Views
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

హొసూరు: కెలమంగలం పోలీసు ఠాణా పరిధి, జీవ నగర్లో సుశీలమ్మ (35) అనే మహిళ ఇంటి ఎదుట కాలిన శవాన్ని పోలీసులు కనుగొన్నారు. ఇది పరిసరాల్లో సంచలనాన్ని సృష్టించింది. డెంకణీకోట డిఎస్పి సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. జక్కేరి గ్రామానికి చెందిన సుశీ లమ్మ (35) జీవానగర్లో నివసిస్తున్నారు. ఈమె మత్తిగిరిలో పని చేస్తున్నారు. కలహాల వల్ల భర్తకు దూరంగా, ఒంటరిగా నివశిస్తున్నారు. వారి ఒకే ఒక కొడుకు కృష్ణగిరిలో చదువు కుంటున్నాడు. మంగళ వారం రాత్రి ఒంటి గంట సమయంలో ఆమె ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తి అగ్నికి ఆహుతి అయ్యాడు. ఇది ఎలా జరిగింది?ఆత్మహత్యా లేక హత్య చేశారా? ఇతర కోణాల్లో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుశీలమ్మను విచారి స్తున్నామనీ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos