చందనసీమలో అగ్రహీరోలైన దర్శన్,కిచ్చ సుదీప్ అభిమానుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ముదదిన నేపథ్యంలో ఇద్దరు హీరోలు తమ అభిమానులకు మద్దతుగా ట్వీట్లు చేసుకోవడం చర్చనీయాంశమైంది.ఇటీవల కిచ్చ సుదీప్ నటించిన పహిల్వాన్ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం,హిందీ,మలయాళం భాషల్లో కూడా విడుదలైన విషయం తెలిసిందే. పహిల్వాన్‘ సినిమాను దర్శన్ అభిమానులు పైరసీ చేసి సినిమాను నడవకుండా చేస్తున్నారని సుదీప్ అభిమానులు దర్శన్ అభిమానులపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో దర్శన్ నేరుగా ఈ విషయంలో కల్పించుకొని నా అభిమానుల జోలికి రావద్దని, వారిపట్ల ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.అందుకు సుదీప్ అభిమానులు స్పందిస్తూ..మీరు మీ అభిమానులకు ప్రాధాన్యత,గౌరవం ఇస్తుండడం సంతోషకరమని అయితే మీ అభిమానులు వేరే వాళ్ల అన్నం లాక్కొని తింటున్నారని మరొక నటుడి చిత్రాన్ని డీప్రమోట్ చేయాలని చూస్తుండడం సబబు కాదంటూ బదులిచ్చారు.ఇక సుదీప్ సైతం గొడవపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. తాను ఎవరి హెచ్చరికలను పట్టించుకోనని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు తన పహిల్వాన్ సినిమా విడుదలైన దగ్గర నుండి చాలా విషయాలు జరుగుతున్నాయని అవి మంచివి కాదని అన్నారు. అన్ని సార్లు స్పందించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.