సైరా: బందిపోటు సేతుపతి

  • In Film
  • January 16, 2019
  • 1040 Views
సైరా: బందిపోటు సేతుపతి

కోలీవుడ్ సెన్సేషన్ విజయ్ సేతుపతి ప్రత్యేకత తెలిసిందే. నవతరం హీరోల్లో సేతుపతి హవా సాగుతోంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ తరహాలో నవ్యపంథా కథల్ని ఎంచుకుని కొత్త గెటప్పులతో సేతుపతి ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల అతడు నటించిన నవాబ్ (చక్కా చివంత వానమ్) – సీతకత్తి  చిత్రాలు ఘనవిజయం సాధించాయి. సీతకత్తి చిత్రంలో  సేనాపతి తరహా లుక్ తో మైమరిపించాడు. సేతుపతి నటనపై కోలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ సేతుపతి కెరీర్ బెస్ట్ ఫేజ్ రన్ అవుతోందిప్పుడు. 2018లో అతడు అరడజను సినిమాల్లో నటించాడు. 2019లో మరో అరడజను సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటిలో సైరా- నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రం ఉంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర ఎంతో ప్రాధాన్యతతో ఉంటుందిట. ఓబయ్య అనే విప్లవకారుడి పాత్రలో అతడు నటిస్తున్నాడు. తాజాగా అతడి పాత్ర లుక్ ని సైరా టీమ్ రిలీజ్ చేసింది. నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ పోస్టర్ ని టీమ్ రివీల్ చేసింది. ఈ పోస్టర్ లో సేతుపతి శివభక్తుడైన ఓబయ్య గా కనిపిస్తున్నాడు. చేతిలో మొండి కత్తి  చూసేందుకే గగుర్పాటునకు గురి చేస్తోంది. ఇక బంధిపోటు తరహాలో సేతుపతి గాంభీర్యం మైమరిపిస్తోంది.ఇటీవలే రజనీ పేట చిత్రంలోనూ సేతుపతి పాత్రకు పేరొచ్చింది. సూపర్ డీలక్స్ – కడైసి వివాసై – ఇదం పొరుల్ యావల్ – మార్కొని మాథాయ్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ నిర్ణయించని పలు చిత్రాలు అతడి క్యూలో ఉన్నాయి. రజనీ – కమల్ హాసన్ – అజిత్ – సూర్య వంటి స్టార్ల తర్వాత అంతే పెద్ద స్థాయిలో రాణిస్తున్న హీరోగా సేతుపతి పేరు మార్మోగిపోతోంది. సైరాకు అతడు ఎంత ప్లస్ అవుతాడో వేచి చూడాల్సిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos