చెల్ల కుమార్‌కు సమస్యల హారాలతో స్వాగతం

చెల్ల కుమార్‌కు  సమస్యల హారాలతో స్వాగతం

తళి:క్రిష్ణగిరి లోకసభ సభ్యులు డాక్టర్ చెల్ల కుమార్ మంగళవారం తళి శాససభ నియోజకవర్గంలో పర్యటించారు. అగ్గొండపల్లి నుంచి పర్యటన ప్రారంభమైంది. కాంగ్రెస్ ,డీఎంకే నాయకులు ,కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. తళి ఎమ్మెల్యే వై. ప్రకాష్, డీఎంకే నాయకులు శ్రీనివాస రెడ్డి మూర్తి ,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికుల సమస్యలను  కుమార్ అడిగి తెలుసు కొన్నారు. దేవాలయ భూములు ఆక్రమణలకు గురి అయిందని ఫిర్యాదు చేసారు. గ్రామంలో అదనపు ట్రాన్సపార్మర్ ఏర్పాటు చేయాలని, కెలవారపల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు సాగు నీరు అందించాలని కోరారు. తమిళనాడు రాష్ట్రంలో మైనారిటీ భాషలను తుడిచి వేస్తున్నారని, పార్లమెంట్లో మైనారిటీ భాష హక్కుల గురించి మాట్లాడాలని గ్రామస్తులు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా పేల్చి శాలువాలు కప్పి ,పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కెలమంగలం,కౌతాళం ,డెంకణీకోటలో పర్యటించి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos