జలదిగ్బంధంలో మహానంది..

జలదిగ్బంధంలో మహానంది..

రాయలసీమ కరువుతీరా రెండు రోజులుగా కర్నూలు,కడప జిల్లాల్లో భారీ వర్షాలకు కురుస్తున్నాయి.భారీ వర్షాల వల్ల నదులు,వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో జలాశయాలు కూడా నీటికళను సంతరించుకుంటున్నాయి. దీంతో సీమ ప్రజల ముఖాల్లో సంతోషం వెల్లివిరస్తోంది.కాగా భారీ వర్షాల కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రం జలదిగ్బంధంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. మహానంది ఆలయం దాదాపు సగం వర్షపు నీటిలో మునిగిపోయింది. గర్భ గుడి సమీపం వరకూ వర్షపునీరు చేరుకుంది. ఆలయంలోని కోనేరు పూర్తిగా నిండిపోయింది. రోడ్లపైకి ప్రవహిస్తోంది. మహానంది గ్రామంలో ఎటు చూసినా మోకాలి లోతు వరకు నీరు నిల్వ ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు స్థానికులు. భారీ వర్షాల కారణంగా- మహానందీశ్వరుడి దర్శనాలను రద్దు చేశారు ఆలయ అర్చుకులు. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మంటపం, కోనేరు నీట మునిగాయి.కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని మైలవరం వద్ద పెన్నానదిపై నిర్మించిన రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. గేట్లను ఎత్తివరద ప్రవాహాన్ని దిగువకు వదిలి వేస్తున్నారు అధికారులు. ఫలితంగా దిగువ ప్రాంతాలైన వేపరాల, దొమ్మర నంద్యాల, జమ్మలమడుగులో కృష్ణాజలాలు ప్రవేశించాయి.ఇదే జిల్లాలో చిత్రావతి మీద నిర్మించిన గండికోట ప్రాజెక్టులో పూర్తిగా నిండిపోయింది.దీంతో పెన్నానదిలో వరద పెరగడంతో సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది.వచ్చే 48 గంటల్లో రాయలసీమలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేశారు.

కోనేరులో చేరుతున్న వరద..

Situation in #mahanandi never seen before

Posted by Mana Nandyala on Monday, 16 September 2019

తాజా సమాచారం

Latest Posts

Featured Videos