జగన్ చెల్లలు షర్మిల చేసిన ఆరోపణలను తప్పుబట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ల సమయం కావటంతో టీడీపీపై లేని పోని నిందలు మోపుతున్నారని అన్నారు. టీడీపీ ఏపీ అభివృద్ధి కోసం కష్టపడే పార్టీ అని అన్నారాయన. అందుకే ఏపీలో ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉందన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ కలిసి ఏపీపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ను కూడా తమపై ఉసిగొల్పాలనే కుయుక్తిలో ఉన్నారని అన్నారు.
జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించటాన్ని తప్పుబట్టారు చంద్రబాబు నాయుడు. ఇది రాష్ట్రాల హక్కులను కాలరాయటమే అని అన్నారు. ఇక జగన్ తీరును కూడా ఏపీ సీఎం తప్పుబట్టారు. వ్యవస్థ మీద నమ్మకం లేదనటం సరికాదని అన్నారు. ఏపీలో క్రైమ్ జరిగితే తెలంగాణ, మద్రాస్ లో ఫిర్యాదు చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.
షర్మిల స్టేట్మెంట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పుడు రాజకీయాలు చేస్తే సహించేది లేదు మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది షర్మిల ఏ పరిస్థితుల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చారో తెలియదు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటే ఎలా?విశాఖలో జగన్పై దాడి జరిగితే హైదరాబాద్వెళ్లి ఫిర్యాదు చేస్తారా ఏపీలో పౌరుడిగా ఉన్నప్పుడు ఏపీ పోలీసులపైన నమ్మకం ఉండాలి
తిరుమల పవిత్రతను కాపాడుతాం: చంద్రబాబు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి చేశాం ఏపీలో ఓటు అడిగే హక్కు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ దేశంలో ఎక్కువ ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ షర్మిల క్యారెక్టర్ మీద టీడీపీ వాళ్లు ఎవరూ మాట్లాడలేదు పాలన చేతకాని పార్టీలు వస్తే వ్యవస్థ కుప్పకూలుతుంది పోలీసులపై చేస్తున్న మెంట్లను ఖండిస్తున్నాం ఎన్నికల కోసం కాదు..ప్రజల కోసం కష్టపడ్డాం 40ఏళ్ల నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం