చింతమనేని అరెస్ట్‌..

చింతమనేని అరెస్ట్‌..

కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే,తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.కులం పేరుతో దూషించారంటూ కొద్ది రోజుల క్రితం దళితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన చింతమనేని బుధవారం భార్య అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకొని స్వగ్రామం దుగ్గిరాలకు వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటివద్దే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు.బుధవారం అజ్ఞాతం వీడుతానని ముందుగానే ప్రకటించిన చింతమనేని చెప్పినట్లే అజ్ఞాతం వీడి దుగ్గిరాలలోని తన ఇంటికి చేరుకొన్నారు.చింతమనేనిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. తోపులాట జరిగింది. చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు. చింతమనేని ప్రభాకర్ పై 52 కేసులు ఉన్నాయి.జంగారెడ్డి గూడెం వైపుగా చింతమనేని ప్రభాకర్‌ను తీసుకెళ్లారు. రహస్య ప్రాంతంలో చింతమనేని ప్రభాకర్ ను తీసుకెళ్లి విచారణ చేస్తున్నారని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos