ఒకప్పటి లేడీసూపర్ స్టార్ విజయశాంతి చాలా కాలం అనంతరం సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో నేటి తరం హీరోయిన్ల గురించి ఎదురైన ప్రశ్నకు విజయశాంతి షాకయ్యే సమాధానమిచ్చారు.ఈ తరం హీరోయిన్లలో తనకు ఎవరూ నచ్చలేదని, ఎవరూ తనని ఇంప్రెస్ చేయలేకపోయారని చెప్పారు.ఇప్పటికీ హీరోయిన్లలో ఎవరికీ పని మీద ధ్యాస లేదని చెప్పారు.ఆరోజుల్లో హీరోయిన్లు ఏడాదిలో ఒకేసారి 18 సినిమాలు చేసేవారని.. కానీ ఇప్పుడున్న వారు అలసిపోతారని ఏడాదికి రెండు, మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నారని కామెంట్స్ చేశారు. కష్టం అనే పదానికి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందని విజయశాంతి అన్నారు.ఇక సినిమా టెక్నాలజీ గురించి మాట్లాడుతూ.. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్పింది.ఎన్టీఆర్, కృష్ణలాంటి స్టార్ హీరోలు ఇరవై రోజుల్లో సినిమా షూటింగ్లు పూర్తి చేసేసేవారన్నారు.ప్రస్తుతు అటువంటి పరిస్థితులు లేవన్నారు..