గుంటూరు: విద్యావంతులకే కులపిచ్చి చాలా ఎక్కువగా ఉంటోందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళ వారం ఇక్కడ జరిగిన పార్టీ న్యాయ విభాగ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘చదువు కున్న వాళ్లకు కులపిచ్చి ఎక్కువగా ఉంది. ఇది చాలా బాధా కరం. కుల రహిత సమాజం కోసం పోరాడటానికి బదులుగా కుల రాజ కీయాలు చేయడం దురదృష్టకరం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎంతో ఆశించా. అది జరగ లేదు. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామి కావటంతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమ నుకున్నా. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దేన్నో కోల్పోయినట్లు గ్రహించాన’న్నారు. రివర్స్ టెండర్ల వల్ల రాష్ట్రం ఏమైపోతుందోనన్న ఆందోళన కలుగు తోందన్నారు. రాష్ట్రం తిరో గమనంలోకి పోయిందని ఆక్రోశించారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. ‘మధ్యంతర ఎన్ని కలు వచ్చే ఆస్కారం లేదు. జమిలి ఎన్నికలు మూడు సంవత్సరాల్లో రావచ్చన్నా’రు.