తిరువనంతపురం: ప్రతిజీవీ బతకుపోరు చేస్తుంది. చివరికు 11 నెలల పసి కూన-రోహిత సైతం దీన్నే చేసింది. కేరళ రాజమల అటవి ప్రాంతంలోని ఇటీవల ఒక రోజు రాత్రి పది గంటల వేళలో ఒక మోటారు వాహనం నుంచి రోహిత జారి కింద పడి పోయింది. లల పసికందు తల్లి ఒడి నుంచి కిందికి జారి పడి పోయింది. వెంటనే ఏం చేసిందో సీసీటీవీ ఫుటేజీ చూస్తే చకితులవుతాం. డండి. కింద పడ్డ పాప చుట్టూ చూసింది. దూరంగా ఉన్న తనిఖీ కేంద్రం వద్ద విద్యుత్ దీపం వెలుగులు చిట్టి కళ్లకు కనిపించాయి. వెలుతురు తనను రక్షిస్తారని భావించిందేమో పాకుతూ తనిఖీ కేంద్రం చేరుకుంది. అక్కడి సిబ్బంది ముఖ మంతా రక్త మోడు తున్నపసి కందును దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. 40 కిమీ ముందుకు సాగిన తర్వాత గానీ తల్లి దండ్రులకు బిడ్డ చేజారినట్లు తెలియలేదు. వెంటనే పోలీసులకు తెలిపారు. చివరకు పాప తల్లిదండ్రుల ఒడి చేరింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సంచరిస్తోంది.