భువనేశ్వర్ : ఆకాశయానం చేయదలచిన ఆదివాసీ యువతి-అనుప్రియ లక్రా (23) కల ఈడేరింది. మల్కాన్గిరి జిల్లా చెందిన అనుప్రియ చిన్నప్ప ట్నుంచి చదువులో దిట్ట. పైలట్ కావాలని కలలు కనేది. ఇంటర్ అయిపోగాయనే భువనేశ్వర్లోని ఒక ఇంజినీరింగ్ కళాశాల్లో చేరింది. ఇంజినీరింగ్ నచ్చక అక్కడి పైలట్ శిక్షణ కేంద్రంలో ప్రవేశించింది. 2012 నుంచి ఏడేళ్ల పాటు పైలట్ శిక్షణ పొందింది. ఇటీవలే ఓ ప్రయివేటు విమానయాన సంస్థలో కోపైలట్గా చేరింది. అనుప్రియ తండ్రి మారినియస్ లక్రా పోలీసు జవాను. తల్లి యాస్మిన్ గృహిణి. తొలి ఆదివాసీ మహిళా పైలట్గా రికార్డు సృష్టించిన అను ప్రియకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క యువతి అనుప్రియను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.