పాకిస్థాన్ చెంప చెళ్లుమనిపించిన ఇరాన్..

పాకిస్థాన్ చెంప చెళ్లుమనిపించిన ఇరాన్..

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి భారత్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని మతిలేని చేష్టలతో ఇప్పటికే పలు దేశాల నుంచి చీత్కారాలు ఎదుర్కొన్న పాకిస్థాన్‌కు తాజాగా ఇరాన్ దేశం కూడా షాకిచ్చింది.ఇప్పటికే కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమంటూ పాకిస్థాన్ చెంప చెళ్లుమనిపించిన ఇరాన్ తాజాగా మరోసారి పాకిస్థాన్ చెంప చెళ్లుమనిపించింది.ఆర్టికల్ 370 రద్దుతో భారత్కు వ్యతిరేకంగా ఇరాన్ లోని పాకిస్తాన్ దౌత్యకార్యాలయం వద్ద భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ బ్యానర్లను ఏర్పాటు చేసింది. కశ్మీరీలకు సంఘీభావంగా ఏర్పాటు చేసినట్లుగా చెప్పే బ్యానర్ల పై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానిక వాటిని తొలగించారుఈ విషయం తెలసుకున్న భారత్ తీవ్ర ఇరాన్ కు తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేసింది.దీంతో తమ భూభాగంలో పాక్ చేసిన పాడు పనిగా ఇరాన్ తీవ్రంగా పరిణమించింది.దీనిపై పాకిస్థాన్‌ను ప్రశ్నించగా తమ దౌత్య కార్యాలయ హక్కుల మేరకే తాము బ్యానర్లను ఏర్పాటు చేశామంటూ పాక్ బదులిచ్చింది.దీంతో ఇస్లామాబాద్ లోని తమ దౌత్య కార్యాలయం వద్ద సౌదీ ఆరేబియాకు వ్యతిరేకంగా బ్యానర్లు పెడితే మీరెలా స్పందిస్తారు? మీరు అందుకు అంగీకరిస్తారా? అని ప్రశ్నించి పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా షాకిచ్చింది.పాక్ మాకు సోదర దేశమని.. అలానే భారత్ తమకు శత్రువు కాదన్నారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరి ఏ మాత్రం మారదని స్పష్టం చేసింది.ఇరాన్ ఇచ్చిన షాక్‌తో పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos