దక్షిణాదిలో హై అలర్ట్..

దక్షిణాదిలో హై అలర్ట్..

ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్పై కసితో రగిలిపోతున్న పాకిస్థాన్ భారత్లో ఉగ్రదాడులకు భారీ స్కెచ్ వేసిందనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.కశ్మీర్లో సైన్యం గస్తీ ముమ్మరం చేయడంతో సముద్ర మార్గం ద్వారా భారత్లోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.దీంతో సముద్ర తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్,మహారాష్ట్ర,కేరళ,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులను అప్రమత్తం చేసింది.ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాలను లక్ష్యంగా ఎంచుకున్నారని దక్షిణాది రాష్ట్రాల్లో భారీ విధ్వంసానికి కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో ముందస్తు చర్యగా గుజరాత్ – మహారాష్ట్ర – కేరళ – తమిళనాడు – ఏపీ తీరంలో భద్రతను తాజాగా నేవీ భారీగా పెంచింది. నిఘాను పటిష్టం చేసింది. గుజరాత్ తీరంలోని సర్ క్రీక్ సంధి వద్ద ఖాళీ పాకిస్తాన్ బోట్లను భారత నేవీ గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అందులో వచ్చిన ఉగ్రవాదులు భారత్ లో ప్రవేశించారని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos