పాకిస్థాన్‌కు రాజకీయంగా,దౌత్యపరంగానే కాదు క్రీడల పరంగా కూడా షాకులు తగులుతున్నాయి.పాకిస్థాన్లో పర్యటించడానికి ఆటగాళ్లు నిరాకరించిన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్థాన్‌తో జరగాల్సిన క్రికెట్ పర్యటన రద్దు చేసుకుంది.ఈనెల 27వ తేదీ నుంచి వచ్చనెల 9వ తేదీ వరకు వన్డే, టీ20 సిరీస్ కోసం పర్యటించాల్సి ఉంది.అయితే పదేళ్ల క్రితం ఇదేవిధంగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక క్రికెట్ జట్టు క్రికెటర్స్ ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఘటనలో క్రికెటర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించడంతో అప్పటి నుంచి ఏదేశం కూడా పాకిస్థాన్‌లో పర్యటించడానికి ఆసక్తి చూపలేదు.అప్పటి ఘటన నేపథ్యంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో లంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగ.. ఏంజిలో మాథ్యూస్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మొతం 10 మంది లంక ఆటగాళ్లు పాక్ పర్యటనను నిరాకరించారట. స్వయంగా శ్రీలంక క్రీడల మంత్రి సీనియర్ క్రికెటర్లని పిలిపించి మాట్లాడినా.. వారు ఒప్పుకోలేదని సమాచారం తెలుస్తోంది. నిరోషన్ డిక్విల్లా, కుశల్ పెరీరా, ధనంజయ డిసిల్వ, తిషార పెరీరా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చందీమల్ కూడా పాక్ టూర్ టూర్ను బహిష్కరించారట.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్థాన్ పర్యటన రద్దు చేసుకుంది..