భారత్‌లో ఉండడానికి అనుమతివ్వండి..

భారత్‌లో ఉండడానికి అనుమతివ్వండి..

భారత్‌లో ఆశ్రయం కల్పించాలంటూ పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ రాజకీయ పార్టీ మాజీ ఎమ్మెల్యే భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంక్వా జిల్లా బారికోట్ మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్ తనకు భారత్‌లో ఆశ్రయం కల్పించాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.మూడు నెలల వీసాపై గతనెల 12వ తేదీన లూధియానాలో తన బంధువుల ఇంటికి వచ్చిన బల్దేవ్ తనకు ఇక పాకిస్థాన్‌కు వెళ్లడం ఇష్టం లేదని ఇక్కడే ఉండాలని ఉందని అందుకు భారత ప్రభుత్వం అనుమతించాలంటూ విన్నవించాడు.పాకిస్థాన్‌లో మైనారిటీలైన హిందువులపై ముస్లింలు దాడులు తీవ్రతరమయ్యాయని ఆర్టికల్ 370 రద్దు అనంతరం దాడులు మరింత తీవ్రతరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుటుంబం క్షేమంగా ఉండాలంటే భారత్‌లోనే ఉండాలని చెప్పిన బల్దేవ్ కుమార్… తనకు రాజకీయంగా ఆశ్రయం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు. మైనార్టీలకు అండగా నిలవడంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విఫలమయ్యారంటూ విమర్శించారు బల్దేవ్ కుమార్.మైనార్టీలపై మతం పేరుతో దాడులు చేస్తున్నారని ఆరోపించిన బల్దేవ్ కుమార్… ఈ దాడులు ప్రభుత్వం, ప్రభుత్వేతర ఏజెన్సీలు చేస్తున్నాయని చెప్పారు. అయితే 2018లో ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మైనార్టీ ప్రజల్లో కాస్త ఆశనెలకొన్నదని అయితే ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం విఫలమయ్యాడని చెప్పారు. కొత్త పాకిస్తాన్ను నిర్మిస్తానని చెప్పిన ఇమ్రాన్ఖాన్ తన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యరని చెప్పారు.నివసించేందుకు పాకిస్తాన్ సురక్షితమైన ప్రాంతం కాదని చెప్పిన బల్దేవ్ కుమార్… సిక్కు పూజారీ కూతురును బలవంతంగా మతం మారేలా చేసి ఓ ముస్లిం వ్యక్తి వివాహం చేసుకున్న తీరును ప్రస్తావించారు. అక్కడ ఓ మతంకు సంబంధించిన పూజారికే గౌరవం ఇవ్వనప్పుడు ఇక ప్రజాప్రతినిధి అయిన తన మాటలను ఎవరు లెక్కబెడుతారని ప్రశ్నించారు.ప్రధాని నరేంద్ర మోడీ తనకు రాజకీయంగా ఆశ్రయం కల్పిస్తారనే నమ్మకం విశ్వాసం తనకుందని చెప్పారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos