అమరావతి: తెదేపా కార్యకర్తలు, నాయకులు ఈ నెల 11న చేపట్టిన ఈ నెల 11న ‘ఛలో ఆత్మకూరు’ కు ప్రభుత్వం ఇంత వరకూ అనుమతించ లేదని హోం మంత్రి సుచరిత సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అనుమతి కోసం దరఖాస్తు వస్తే పరిశీలిస్తామని చెప్పారు. పల్నాడులో తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరిగినట్లు తెదేపా చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ‘2014-19 మధ్య ఆరు రాజకీయ హత్యలు జరిగాయి. 2019 ఎన్నికల తర్వాత ఎక్కడా ఇలాంటి హత్యలు జరగలేద’న్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని అన్నారు.