గడ్కరీ కారుకూ జరిమానా

గడ్కరీ కారుకూ జరిమానా

ముంబై: వేగంగా వెళ్తున్న కారణంగా ముంబైలో తన పేరిట ఉన్న కారుకూ జరిమానా వేసారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సోమవారం ఇక్కడ విలేఖ రులకు తెలిపారు. దేశంలో రోడ్ల భద్రత మరింత మెరుగుపరచేందుకు జాతీయ రహదారుల వెంబడి 786 ప్రమాద స్థలాల్ని గుర్తించామని చెప్పా రు. 30 శాతం డ్రైవింగ్ లైసెన్స్లు నకిలీవనీ తెలిపారు. అవినీతి పెరగడానికి భారీ జరిమానాలు దారి తీస్తాయనే ఆందోళల్ని కొట్టిపారేసారు. ‘అవినీతి పెరుగు తుందని ప్రజలు ఎలా అంటారు? అదెలా సాధ్యం? మేము ప్రతి చోటా కెమెరాలు ఏర్పాటు చేశాం’ అన్నారు. డిజిలాకర్, ఎంపరిహావన్ వంటి డిజిటల్ ప్లాట్ఫాంలను ఉపయోగించుకుని ప్రజలు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్ని ఇతర దస్త్రాల్ని ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు చూపించవచ్చన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos