పెట్టుబడుల కోసం పాకిస్థాన్ ఎంతకు దిగజారిందంటే..

పెట్టుబడుల కోసం పాకిస్థాన్ ఎంతకు దిగజారిందంటే..

కుప్పకూలిపోయిన ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అష్టకష్టాలు పడుతున్న పాకిస్థాన్ ఆర్థిక లోటు పూడ్చుకోవడానికి గాడిదలు,శునకాలు ఎగుమతి చేసే స్థాయికి దిగజారింది.చివరకు మంత్రులు,అధికారుల సమావేశాల్లో టీ,బిస్కెట్లు సైతం కోత విధించారంటే పాకిస్థాన్ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ద్రవ్యోల్బణం ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.ఈ తరుణంలో విదేశాల నుంచి పెట్టుబడుల వరదల పారితే తప్ప పాకిస్థాన్ దేశ ఆర్థిక పరిస్థితి కోలుకోలేదు.దీంతో పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి పాకిస్థాన్ చేసిన పని ప్రతి ఒక్కరిని నివ్వెరపరుస్తోంది.పాకిస్తాన్ లో పెట్టుబడులను పెట్టడానికి గల అవకాశాలను వివరించడానికి అజర్ బైజాన్ లో ని బాకూ నగరంలో కొద్దిరోజుల కిందట ఏర్పాటు చేసిన ఓ అంతర్జాతీయ స్థాయి ఇన్వెస్టర్ల సదస్సులో బెల్లీ డాన్సులను ఏర్పాటు చేసింది.ఈ పెట్టుబడిదారుల సదస్సులో బెల్లీ డాన్సర్లు రెచ్చి పోయారు. అర్ధనగ్న ప్రదర్శనతో పెట్టుబడిదారుల మతి పోగొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పాకిస్తాన్ ప్రభుత్వమే ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడటం పట్ల సొంతదేశం నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos