ఐటీ రిటర్నుల దాఖలు…రేపే ఆఖరు

  • In Money
  • August 30, 2019
  • 155 Views
ఐటీ రిటర్నుల దాఖలు…రేపే ఆఖరు

ఢిల్లీ : ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగించేది లేదని, శనివారంతో గడువు ముగియనుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి  ఐటీ రిటర్నులను సమర్పించే గడువు సెప్టెంబరు 30 వరకు పొడిగించినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన ఐటీ శాఖ గడువు పొడిగించలేదని స్పష్టం చేసింది. వాస్తవానికి జులై 31తో గడువు ముగియాల్సి ఉంది. అయితే రిటర్నులు దాఖలు చేసేటప్పుడు సమస్యలు వస్తున్నాయని, కనుక గడువు పెంచాలని అభ్యర్థనలు రావడంతో ఈ నెల 31 వరకు పొడిగించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos