ముంబై : సినిమా అందమైన లోకమని ఊహించుకుని వచ్చింది. అవకాశాలైతే వచ్చాయి కానీ, విజయమాల పడలేదు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన నటి పెరల్ పంజాబీ, తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. చాలా కాలం నుంచి ఆమె బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నారని, ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు పెరల్, ఓషివారా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. తల్లితో తరచూ గొడవలు జరిగేవి. గతంలో రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు బిపిన్ కుమార్ ఠాకూర్‌కు ఏదో శబ్దం వినిపించింది. రోడ్డుపై ఎవరో అరుస్తున్నారని వెళ్లాడు. ఈలోగా మూడో అంతస్తు నుంచి కేకలు వినిపించాయి. అప్పటికే పెరల్ తీవ్ర గాయాలతో మరణించారు.