ఇమ్రాన్‌ఖాన్‌కు విద్యుత్‌శాఖ షాక్‌..

ఇమ్రాన్‌ఖాన్‌కు విద్యుత్‌శాఖ షాక్‌..

భారత్‌తో యుద్ధానికి సిద్ధమంటూ వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు పాక్‌ దేశ విద్యుత్‌శాఖ షాకిచ్చింది.ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌ ప్రభుత్వం చివరకు ప్రధాన మంత్రి కార్యాలయం విద్యుత్‌ బిల్లులను సైతం చెల్లించలేని దుస్థితిని ఎదుర్కుంటోంది.నెలలుగా పేరుకుపోయిన విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.41లక్షలకు చేరుకోవడంతో బిల్లు కట్టాలంటూ ఇప్పటికే ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ పలుమార్లు నోటీసులు సైతం జారీ చేసినప్పటికీ.. పీఎంవో నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బిల్లు చెల్లించని పక్షంలో పీఎంవో ఆఫీసుకు కరెంట్ నిలిపివేస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించినట్లు పాక్‌ మీడియా వర్గాలు కథనాలు ప్రచురించాయి.బయట నుంచి అప్పు పుట్టక ఆదాయం లేక పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.చివరకు మంత్రులు,అధికారుల సమావేశాల్లో టీ,బిస్కట్ల,వార్త పత్రికలపై కూడా కోత విధించడం పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతోంది.ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతుండడం గమనార్హం..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos