ఇక సాహో మీది..అవాస్తవాలను ప్రచారం చేయకండి

  • In Film
  • August 30, 2019
  • 176 Views
ఇక సాహో మీది..అవాస్తవాలను ప్రచారం చేయకండి

రెండేళ్లుగా ఎదురు చూస్తున్న సాహో చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.అయితే చిత్రానికి ప్రేక్షకులు,విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుండగా పైరసీ భూతం చిత్ర బృందాన్ని వెంటాడుతోంది.భారీ వ్యయంతో నిర్మించిన చిత్రాన్ని భారీ రేట్లకు విక్రయించిన నేపథ్యంలో పైరసీ బారిన పడితే వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పైరసీ నుంచి సాహోను కాపాడుకోవడానికి చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా కపూర్‌ అభిమానులకు, ప్రేక్షకులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించామని.. సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని చెప్పింది. చిత్రబృందం ఎన్నో సంవత్సరాల కష్టమే చిత్రమని.. మీ ప్రేమాభిమానాలతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని.. ఇప్పుడు మా కష్టాన్ని మీ ముందు ఉంచామని చెప్పిన శ్రద్ధా.. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూఇక సాహో మీది..అవాస్తవాలను ప్రచారం చేయకండి.. పైరసీని ప్రోత్సహించకండిఅని చెప్పుకొచ్చారు.”సాహో సినిమాను మీ దగ్గర్లోని థియేటర్లలోనే చూడండి.. ఒకవేళ ఎవరైనాసినిమా పైరసీ చేసినట్లు తెలిస్తే వెంటనే నేను ఇచ్చిన పైరసీ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించండి” అంటూ పోస్ట్ పెట్టారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos