సింధూ విజయానికి బాబు కారణమట..

సింధూ విజయానికి బాబు కారణమట..

బ్యాడ్మింటన్‌లో ప్రపంచ విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధూపై జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,నేతలు సినీక్రీడా రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పీవీ సింధూ సాధించిన విజయంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి,చంద్రబాబు తనయుడు లోకేశ్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది.పీవీ సింధూ విజయం వెనుక చంద్రబాబు శ్రమ,దార్శనికత దాగుందంటూ నారా లోకేశ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోపీచంద్ కు అయిదెకరాల స్థలం ఇవ్వటం వలనే..ఇప్పుడు అకాడమీ పీవీ సిందూ లాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు లోకేశ్ చేసిన ట్వీట్ మీద సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.సింధు దేశానికి స్వర్ణ పతకం తీసుకొచ్చి.. దేశ ప్రతిష్టను పెంచిన సమయంలో సింధును అభినందించటానికి పరిమితం కాకుండా.. ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేయటంపై విమర్శలు మొదలయ్యాయి. స్థలం ఇవ్వటం కంటే..సింధూ పడ్డ కష్టం..ప్రపంచ స్థాయి టోర్నమెంట్ లో అద్భుత ప్రతిభను అభినందించి ప్రోత్సహించాల్సిన సమయంలో ఇటువంటి ట్వీట్ లు సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.స్థలం ఇచ్చినంత మాత్రాన పతకాలు వచ్చేస్తాయా అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సానియా మీర్జా ఫొటో కింద పిటీ ఉషా పేరు రాయడంపై పేర్కొనటంపై విమర్శలు మొదలయ్యాయి.ఈ ఫోటోపై సైతం నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే సంగతి అటుంచి, స్వాతిముత్యాల్లాంటి తమ పార్టీ నేతల క్రీడా పరిజ్ఞానంతో క్రీడాకారులను అవమానించకపోతే చాలు అన్నట్టు వ్యవహరిస్తోంది. సానియా మీర్జా ఎవరో, పి.టి. ఉష ఎవరో తెలీని దురవస్థలో క్రీడాశాఖ మంత్రి ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు.అధికారులు చేసిన పొరపాటు కంటే సింధూ విజయానికి చంద్రబాబు కారణమని చెప్పుకోవడానికి నారా లోకేశ్‌ ప్రయత్నించిన తీరుపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos