శ్రీనగర్ : జమ్ములోని ఐదు జిల్లాల్లో గురువారం చరవాణి మొబైల్ సేవలను పునరుద్ధరించారు. స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్ధలు తెరుచు కున్నా విద్యా సంస్థల్లో హాజరు చాలా తక్కువగా ఉంది. మరో వైపు సుప్రీం కోర్టు అనుమతితో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురు వారం శ్రీనగర్‌కు రానున్నారు. ఇక్కడ గృహ నిర్బంధంలో ఉన్న, అనారోగ్యం పాలైన తమ ఎమ్మెల్యే యూసఫ్ తరిగామిని పరామర్శించనున్నారు.