మహిళా ఎస్పీ లైంగిక వేధింపుల కేసు తెలంగాణకు బదిలీ..

మహిళా ఎస్పీ లైంగిక వేధింపుల కేసు తెలంగాణకు బదిలీ..

తమిళనాడు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళ ఐపీఎస్‌ అధికారి పెట్టిన కేసు తాజాగా తెలంగాణకు బదిలీ అయ్యింది.మహిళ ఐపీఎస్‌ అధికారి విజ్ఞప్తి మేరకు కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసుకు సంబంధించి అన్ని ఫైల్స్ ను తెలంగాణ సీఎస్ కు అందజేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది.ఐజీ స్థాయి అధికారి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ గత ఏడాది ఆగస్ట్‌ 21వ తేదీన మహిళ ఎస్పీ ఇంటర్నల్‌ కమిటీకి ఫిర్యాదు చేయడంతో లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కేసుపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణకు మధ్యంతర కమిటీని నియమించగా కమిటీ విచారణలో ఉన్నతాధికారి తనను ఎలా వేధిస్తున్నాడో గ్రాఫిక్స్ ద్వారా బాధితురాలు కమిటీకి వివరించింది.చాలాసార్లు అధికారి తనను కౌగిలించుకున్నాడని తాను వ్యతిరేకించడంతో వేధించడం మెుదలుపెట్టినట్లు బాధితురాలు కమిటీ ఎదుట వాపోయింది. అయితే తమిళనాడులో తీవ్రంగా ఒత్తిడులు ఉన్న నేపథ్యంలో కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని మహిళా ఎస్పీ విజ్ఞప్తి చేయడంతో మద్రాస్ హైకోర్టును ఆదేశించింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos