న్యూ ఢిల్లీ: ‘తెదేపా రాజ్యసభ సభ్యులు నలుగురు భాజపాలోకి ఫిరాయించడం అనైతిక చర్య. పాలక పక్షంలోకి ఫిరాయించనపుడు పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. కొన్ని నైతిక విలువలు పాటించాలి. ఆ ఫిరాయింపులకు అనుమతి ఎలా లభించందని’ శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జరిగిన చట్టసభల అధిపతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఫిరాయింపులు ప్రజా స్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయని ఆక్రోశించారు. సభాపతి పదవి ఎంతో పవిత్రమైనదని కొనియాడారు. అయితే మాజీ సభాపతి కోడెల శివ ప్రసాద రావు చట్టసభ సామగ్రిని తన సొంత ఇంటికి తరలించడం దురదృష్ట కరమని వ్యాఖ్యానించారు. అది సభాపతి వ్యవస్థకు మాయని మచ్చని అభివర్ణించారు. కోడెల వ్యవహారంలో విచారం మాత్రం వ్యక్త పర్చగలను తప్ప ఇంక ఎక్కువ మాట్లాడదలచు కోలేద న్నారు. దీన్ని కక్ష సాధింపు చర్యలని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కక్ష సాధింపని ఒక్క పౌరుడు అన్నా తాను పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభు త్వాల వల్లా ఫిరాయిం పులు పెరిగిపోతున్నాయన్నారు. రాజకీయాల్లో నైతి కతను అటక ఎక్కించటం దురదృష్టకర మన్నారు. ఇతర వ్యవ స్థలు తప్పు చేస్తే ప్రజా వ్యవస్థ గుణపాఠం చెబుతుందన్నారు.