ఢిల్లీ : ఉన్నత శ్రేణుల రైళ్లలో టికెట్ ధరలపై వచ్చే నెల నుంచి 25 శాతం వరకు రాయితీని ఇవ్వనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. శతాబ్ది, గతీమాన్, తేజస్, డబుల్ డెక్కర్, ఇంటర్ సిటీ రైళ్లలో ఈ రాయితీ పథకాన్ని అమలు చేస్తారు. గత ఏడాది నెలవారీ ఆక్యుపెన్సీ 50 శాతం కన్నా తక్కువ ఉన్న రైళ్లలో కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. విమాన ఛార్జీలు తగ్గడంతో ప్రయాణికులను ఆకర్షించడానికి రైల్వే శాఖ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. తక్కువ ఆక్యుపెన్నీ ఉన్న మరిన్ని రైళ్లలో కూడా ఈ పథకాన్ని కొనసాగించే విషయమై నిర్ణయం తీసుకోవాలని రైల్వే వాణిజ్య విభాగం దేశంలోని వివిధ జోన్లను ఆదేశించింది.